కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో అతి వేగంతో వచ్చిన వ్యాను అదుపుతప్పి రోడ్డు పక్కన కూర్చున నలుగురిపై దూసుకెళ్లింది. దీంతో ఆ నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. అమ్ములు, దేవి కడపలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. సంఘటన ఈ వ్యాన్‌ కడప నుంచి రాయచోటికి వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు ప్రమాదానికి కారణమైన జిప్సీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.