వకీల్ సాబ్ టిక్కెట్స్ ట్రెండ్: తెలుగు సినీ పరిశ్రమలో నయా ట్రెండ్

Vakeel Saab Tickets Help: New Trend In Tollywood

Vakeel Saab Tickets Help: New Trend In Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్టూ ఫ్లాపూ.. అనే తేడా లేకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలకెప్పుడూ విపరీతమైన హైప్ క్రియేట్ అవుతూ వుంటుంది. ఎప్పుడూ వుండే హైప్ వేరు.. ఇప్పుడు క్రియేట్ అయిన హైప్ వేరు. ఇది న భూతో న భవిష్యతి.. అనడం సబబేమో. కరోనా ఓ వైపు భయపెడ్తున్నా.. ‘వకీల్ సాబ్’ విషయంలో సగటు సినీ అభిమాని.. ఆ భయాల్ని పక్కన పెట్టేశాడు. పవన్ కళ్యాన్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ దొరకడం అంటే అంత ఆషామాషీ కాదు.

అందుకే, ఆ టిక్కెట్ల కోసం ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి పారేస్తున్నారు. ‘వకీల్ సాబ్ టిక్కెట్స్ హెల్ప్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా.. అభిమానులు ముందే బుక్ చేసుకున్న తమ టిక్కెట్లను, టిక్కెట్లు దొరకని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే, దీన్ని అవకాశంగా తీసుకుని, కొందరు భారీ రేట్లకు టిక్కెట్లను అమ్మేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. అయితే, జెన్యూన్ ఫాన్స్ మాత్రం.. సాటి అభిమానుల కష్టాన్ని గుర్తెరిగి వారికి సాయం చేస్తున్నామంటున్నారు. దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయిపోయిన దరిమిలా, ‘వకీల్ సాబ్ టిక్కెట్ హెల్ప్’ ద్వారా టిక్కెట్లు సోషల్ మీడియాలో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయ్. వేణు శ్రీరామ్ దరశకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన విషయం విదితమే. బాలీవుడ్ సినిమా ‘పింక్’కి ఈ ‘వకీల్ సాబ్’ తెలుగు రీమేక్.