Vaishnavi chaithanya: అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయినా ఆనంద్ దేవరకొండ హీరోయిన్..!

Vaishnavi chaithanya: సోషల్ మీడియాలో తన షార్ట్ ఫిలిమ్స్ , వీడియో సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న భామ వైష్ణవి చైతన్య . తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే కదా.. ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ క్యారెక్టర్ లో నటించి వైష్ణవి అందరిని మెప్పించింది . అంతేకాకుండా ” సాఫ్టువేర్ డెవలపర్ ” వెబ్ సిరీస్ ద్వారా అందరి మనసులు దోచుకుంది .వైష్ణవీ చైతన్య, షణ్ముఖ్ జశ్వంత్ కలిసి చేసిన ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రికార్డుస్థాయిలో వ్యూస్ రాబట్టింది.

సాఫ్టువేర్ డెవలపర్ మొదటి సీజన్ తర్వాత వైష్ణవికి పెళ్లి అయిపోయిన కూడా రెండో సీజన్లో కూడా వైష్ణవిని తీసుకోవాలని డిమాండ్ చేశారు అంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్యకు ఉన్న క్రేజ్ , ఫాలోయింగ్ వల్ల సినిమాలలో కూడా ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి . తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ చిత్రంలో లో వైష్ణవి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందది . మంగళవారం వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా బేబీ సినిమా హీరో , యూనిట్ సభ్యులు అంతా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .

ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని చేసిన పనికి ఆమె బాగా ఎమోషనల్ అయిపోయారు . ఆ అభిమాని వైష్ణవి చైతన్య పేరును టాటూగా వేయించుకొని మరి తన అభిమానాన్ని చాటుకున్నాడు .ఆ వీడియోను చూసిన వైష్ణవి చైతన్య తీవ్ర భావోద్వేగానికి లోనై మాటలు రావడం లేదు.. ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఐ లవ్ యు సో మచ్ అంటూ ఎమోషనల్ అయిపోయారు . ఇంత ప్రేమించే అభిమానులు తనకి దొరకటం తను అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు .