మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి చిత్రం ఉప్పెనతో సూపర్ హిట్ సాధించి పరిశ్రమలోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ఆశీస్సులు పొందిన వైష్ణవ్ జోరుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మెగా హీరో తన రెండో సినిమా ఏకంగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ మూవీ విడుదలవక ముందే వైష్ణవ్ మరో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కు దర్శకత్వం వహించిన గిరీశాయ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఇదివరకనే మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా తగ్గుముఖంతో ఆగిన సినిమాల షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. మెగా హీరోకు జోడిగా కేతిక శర్మ ఈ మూవీలో సందడి చేయబోతుంది. ఉప్పెన మూవీకి ప్రాణంగా నిలిచిన సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారు. మిగిలిన నటీనటుల,సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.