వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫిక్స్ అంతే

Vaishnav Tej, Krithi shetty pair repeat second time

Vaishnav Tej, Krithi shetty pair repeat second time

వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో వైష్ణవ్ హాట్ షాట్ అయిపోయాడు. ప్రజెంట్ ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఉండనుంది. దీన్ని కూడ కొత్త దర్శకుడే తెరకెక్కించనున్నాడు. ఇందులో కథానాయకిగా కృతి శెట్టిని తీసుకోనున్నారు. ఇన్నిరోజులు ఇది రూమర్ అనే అనుకున్న ఇప్పుడు మాత్రం ఖాయమని కన్ఫర్మేషన్ అందింది. కృతి శెట్టి ‘ఉప్పెన’తో యువతలో మంచి పాపులారిటీ దక్కించుకుంది.

ఆ సినిమా చూసిన ప్రేక్షకులంతా కృతి శెట్టికి కితాబిచ్చేశారు. అందం, అభినయం రెండూ ఉన్నాయని మెచ్చుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీని ఇంకొన్నేళ్ల పాటు తెలుగు ఆడియన్స్ మర్చిపోలేరు. వారి జోడీని మరోసారి ఆన్ స్క్రీన్ మీద చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అందుకే మరోసారి వారి జోడీని రిపీట్ చేయనున్నారు. ఈ సినిమా ఇంకో మూడు నెలల్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.