జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు కమ్మవారిని వర్గ శత్రువుగా వైకాపా ప్రకటించిందని.. జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషిస్తూ మాట్లాడారని.. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అంటూ.. అనాల్సిన మాటలు అని జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే సరేనా అని ప్రశ్నించారు.
ఒంగోలులో వైశ్య కులానికి చెందిన వైకాపా కార్యకర్త మాట్లాడితే ఆయనపై దాడి చేశారు అని.. కులాన్ని కూడా వర్గ శత్రువుగా చూస్తుంది అని.. ముఖ్యంగా ఓట్లు వేయని ప్రతి కులాన్ని వర్గ శత్రువుగా పరిగణించవచ్చు అనే సంస్కృతిని తీసుకొచ్చింది అని మండిపడ్డారు. కోనసీమలో బీసీలు, మత్స్యకారులు, దేవాంగులు, శెట్టిబలిజ లను శత్రువులు గా ప్రకటించారని అన్నారు.