Hunter Chapter1: థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1!

Hunter Chapter1: హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1. ఈ సినిమా తాజాగా జూన్ 13వ తేదీన గ్రాండ్గా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే. జూన్ 13న, అంగరంగ వైభవంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను, ఉత్సాహాన్ని నింపి సినిమాపై బజ్‌ ను పెంచాయి. అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్స్ లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

కాగా ఈ సినిమాలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. షెరీఫ్ గౌస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్,సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. అర్రోల్ కొరెల్లి అందించిన సంగీతం అందిచగా బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ అందించారు. సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌ తో రూపొందిన హంటర్ చాప్టర్ 1 ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

మిస్టరీని ఛేదించే హీరో ప్రయాణం, ఊహించని మలుపులు, చివరి వరకు ఉత్కంఠను రేపే కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రస్తుతం పాజిటివ్ టాక్ లభిస్తోంది. నేడు రేపు వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు తెరకెక్కినప్పటికీ ఈ సినిమా సరికొత్త అనుభూతిని అందిస్తుంది.