మెగా హీరో కోసం రంగంలోకి దిగిన తమిళ స్టార్ హీరో.. ఎవరంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గని చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈయన తన ఆశలన్నీ ఎఫ్ 3 సినిమాపై పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకుండానే వరుణ్ తేజ్ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నారు.

ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన కథల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న ప్రవీణ్ సత్తార్ సినిమా అంటేనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈయన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ వాన సినిమాలో విలన్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత డిటెక్టివ్ డాక్టర్ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించిన వినయ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ కు గట్టిపోటీగా ప్రవీణ్ సత్తార్ నటుడు వినయ్ రాయ్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనిని కలిసి కథ వివరించడంతో ఈ సినిమాలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకుంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.