Ukraine: రష్యా మీదుగా భారత్ కు విమానాలు నిలిపివేత.. కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా..?

Ukraine: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పై దృష్టి సారించారు. రష్యా దాడుల్లో ఇప్పటికే ఎంతోమంది ఉక్రెయిన్ ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఉక్రెయిన్ ప్రజలు ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు వలస బాట పట్టారు. ఇకపోతే ఇది ఇలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండడంతో అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే భాగంగా రష్యా మీదుగా భారత్ కు విమానాలు నిలిపివేసింది. అందుకు సంబంధించిన వివరాలను అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

వారి దేశం నుంచి ముంబై, ఢిల్లీకి చేరేందుకు రష్యా జగన స్థలాన్ని ఉపయోగించడాన్ని నిలిపివేసినట్టు అమెరికా స్పష్టం చేసింది. వారు తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అమెరికన్ ఎయిర్ లైన్స్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీ,న్యూయార్క్ మధ్య తిరిగే విమానాలు రష్యా గగనస్థలాన్ని వినియోగించకుండా నిలిపివేశామని తెలిపింది. అంతేకాకుండా రష్యా విమానాలు అమెరికా గగనతలం మీదుగా వెళ్లడాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ ప్రకటించిన అనంతరం విమాన యాన సంస్థలు ఈ ప్రకటన చేయడం గమనార్హం.