Urfi Javed: మిడిల్ ఫింగర్ చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు!

Urfi Javed: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ఉర్ఫీ జావేద్ ఒకరు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానుల సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈ ముద్దుగుమ్మ దారుణంగా నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురవుతారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ మరోసారి నెటిజన్ల చేతిలో దారుణమైన కామెంట్లకు గురైంది.

యూట్యూబ్‌లో విడుదలై మంచి ఆదరణ పొందిన సాంగ్ ‘ఏబీసీడీఈఎఫ్‌యూ’. ఓ అమెరికన్ సింగర్ పాడిన ఈ పాటకి రీల్ చేసి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆ పాటకు లిప్ సింక్ ఇస్తూనే మిడిల్ ఫింగర్ చూపించడంతో నెటిజన్లు ఈమెను దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో నీలిరంగు బ్రా వేసుకొని దాని పైకి నెట్ ధరించడంతో మరింత మంది ఈ వీడియో పై స్పందించి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఏంటి మేడం మీకు ఇలాంటి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మార్కెట్లో పండ్లను అమ్మడానికి ఉపయోగించి నెట్ ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మార్వెల్ మూవీ ‘నో వే హోమ్’ని గుర్తు చేస్తూ ‘స్పైడర్ మ్యాన్ నిన్ను చూసి ఆర్ నెట్ తీసుకు వచ్చినట్లు ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఈ దుస్తులలో మీకు చలి వేయడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.