ఉత్తరప్రదేశ్ శాసనసభ ఐదో విడత పోలింగ్ షూరు అయ్యింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఐదో విడతలో 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతుంది. మెుత్తంగా ఈ అసెంబ్లీ స్థానాలలో 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేథి, రాయ్ బరేలీ, అయోధ్య కేంద్రాలు ఉన్నాయి. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 7 విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 3తో పోలింగ్ మెుత్తం పోలింగ్ ముుగుస్తోంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Uttar Pradesh: యూపీలో ఐదో విడత పోలింగ్ షూరు!
