న్యాచురల్ స్టార్ నాని యాక్టింగ్ ను ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అష్టాచమ్మా సినిమాతో హీరోగా నాని కెరీర్ ను మొదలుపెట్టగా వరుస ఫ్లాపులు ఎదురైన సమయంలో మళ్లీ సక్సెస్ సాధించి నాని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో గతేడాది సక్సెస్ ను సొంతం చేసుకున్న నాని మరో రెండు వారాల్లో అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
భిన్నమైన కథతో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా నటించారు. ఈ సినిమాతో పాటు నాని దసరా అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. దసరా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
అయితే ఒక సినిమా మాత్రం హీరో నాని డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణమైంది. నాని కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా కూడా ఒకటి. తాతినేని సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం హీరో నాని నిద్రలేని రాత్రులు గడిపారని సమాచారం. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలివారం మంచి కలెక్షన్లను సాధించింది. కానీ కొందరు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు.
ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవడం చాలామందికి నచ్చలేదు. ఆశించిన స్థాయిలో ఫలితం దక్కకపోవడంతో నాని డీలా పడ్డారని సమాచారం. భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అనుకున్న ఈ సినిమా ఫ్లాపైందని తెలిసి నాని డిప్రెషన్ లోకి వెళ్లారని సమాచారం. ఆ తర్వాత రోజుల్లో నాని వరుస విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటారు.