‎Ari: డైరెక్టర్ ని ప్రత్యేకంగా అభినందించిన కేంద్రమంత్రి.. ఏడేళ్ల శ్రమ ఫలించిందంటూ!

Ari: డైరెక్టర్ జయశంకర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా పేపర్ బాయ్. ఇకపోతే ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ అరి. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్ట పడ్డారు. ఏడేళ్ల కఠోర శ్రమ తర్వాత రూపొందించిన చిత్రమే అరి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అక్టోబర్ 10న విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

‎అలాగే మీడియా సమీక్షలు, సోషల్ మీడియా పోస్టులు, మౌత్ టాక్ అంతా పాజిటివ్‌ గానే రావటంతో ఈ వారం విడుదలైన సినిమాలలో అరి ముందంజలో నిలిచింది. ఈ సానుకూల ఫలితం చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సందర్బంగా ఈ తొలి విజయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం గుర్తించి, దర్శకుడు జయశంకర్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు మీ ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కింది. అరి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని మంత్రి కొనియాడారు.

‎ప్రస్తుతం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న లోతైన కథ ఆకర్షణీయమైన కథనం, ప్రేక్షకుల మనసును తాకే సందేశం అని చెప్పాలి. అనూప్ రూబెన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా విజువల్స్ పరంగానూ అరి మూవీకి మంచి ప్రశంసలు దక్కాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మొదలు నుండి ముగింపు వరకు దర్శకుడు జయ శంకర్ ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌ లోకి తీసుకెళ్లి, సన్నివేశాలను నడిపించిన తీరును చూసిన ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఈ సినిమాతో రెండవ సక్సెస్ ని అందుకున్నారు డైరెక్టర్ జయ శంకర్. ఇకపోతే ఇందులో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు నటించిన విషయం తెలిసిందే. సినిమాలోని మాటలు, పాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.