టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు నటుడిగా మాత్రమే కాకుండా ఆ రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడు. గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజుకి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రభాస్ తో బేటీ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలు అందించిన కృష్ణంరాజు మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ కుటుంబాన్ని కలవనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్ రానున్నారు రాజ్ నాథ్ సింగ్ 16 వ తేదీన నిర్వహించనున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 16 వ తేదీన రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ సంస్కరణ సభలో పాల్గొనున్నారు.
ఇక కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 180 కి పైగా చిత్రాలలో నటించి రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. ఇక సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు మెయినాబాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారిక లాంచనాలతో పూర్తి చేశారు. కృష్ణంరాజు మరణ వార్త నుండి ఇప్పటికీ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది.