పాపం వర్షను.. కృష్ణ భగవాన్ కూడా వదల్లేదుగా… దారుణంగా సెటైర్లు వేసిన కృష్ణ భగవాన్?

గతంలో జబర్థస్త్ కామెడీ షో లో మగవారే కామెడీ చేసేవారు. కానీ కొంతకాలంగా మగవారితో పాటు లేడీ కమెడియన్లు కూడా జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ లుగా పాపులర్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించిన వర్ష జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయ్యింది. వర్ష ఇమాన్యుల్ లవ్ ట్రాక్ వల్ల వీరిద్దరూ మరింత పాపులర్ అయ్యారు. అయితే వీరిద్దరు కూడా కేవలం టిఆర్పి కోసం మాత్రమే జంటగా నటిస్తున్నారని క్లియర్ అయ్యింది. ప్రస్తుతం వర్ష శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలలో బాగా సందడి చేస్తోంది.

ఇదిలా ఉండగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో తరచూ వర్ష మీద బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. లేడీ గెటప్, మగవాడు అంటూ వర్ష మీద ఎప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వర్ష అలా మారటానికి సర్జరీలు కూడా చేయించుకుందని సెటైర్లు వేస్తుంటారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా సెటైర్లు వేసిన కూడా వర్ష మాత్రం బాధపడకుండా చాలా స్పోర్టివ్ గా నవ్వుతూ ఉంటుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కూడా మరొకసారి వర్ష మీద ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ ఎపిసోడ్ లో టాలివుడ్ ఫేమస్ కమెడియన్ కృష్ణభగవాన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ లో నా కొడుకు అనే కాన్సెప్ట్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిన్నప్పుడు తప్పిపోయిన కృష్ణ భగవాన్ కూతురు, కొడుకు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆది రాంప్రసాద్ కృష్ణ భగవాన్ కొడుకు నేనంటే నేను అంటూ పోటీ పడగా మీరు దొంగ నా కొడుకులు అని సెటైర్ వేస్తాడు. ఇక వర్ష కూడా నాన్నగారు అంటూ వచ్చి నేనే నేనే మీ కూతుర్ని అంటుంది. దీంతో కృష్ణ భగవాన్ వీడే నా కొడుకుని వర్షని చూస్తూ అంటాడు. అందరిలాగే కృష్ణ భగవాన్ కూడా వర్షని అబ్బాలాగా ట్రీట్ చేస్తాడు. దీంతో వర్ష తలపట్టుకుని వెళ్ళిపోతుంది.