విడుదలకు ముందు అనూహ్యపరిణామాలు .. కరోనా బారిన పడ్డ శశికళ !

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే ఆమె జైలులో ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు.

విడుదలకు ముందు ట్విస్ట్.. కరోనా బారిన పడ్డ శశికళ

శశికళకు ప్రస్తుతం ఆమెకు కోవిడ్‌ 19 సోకిందని వైద్యులు ధృవీకరించారు. ఆమెకు ఇతర ఏ అనారోగ్యాలు లేవని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె ఆక్సిజన్‌ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోందని ఆస్పత్రి సూపరిండెంట్‌ రమేశ్‌ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్‌ చేయవచ్చన్నారు.
మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్‌ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్‌ ఆరోపిస్తున్నారు. మరో వైపు చిన్నమ్మ విడుద‌ల కోసం కొందరు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారీ ఏర్పాట్లను చేసింది ఓ వర్గం. జైలు నుంచి చెన్నైకి ఏకంగా వెయ్యి వాహ‌నాల‌తో వ‌స్తార‌నే ప్రచారం కూడా సాగుతోంది‌. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేయడానికి సిద్ధమయ్యారు. శశికళకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న‌మ్మ వచ్చిన త‌ర్వాత తమిళనాడు పాలిటిక్స్ లో భారీ మార్పులు వస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు శశికళకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆమె రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి