Uday shankar: ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా..?

Uday shankar: తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో ఉదయ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయశంకర్. ప్రస్తుతం ఉదయ శంకర్ గురు పవన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్ లో ఉదయశంకర్ యూత్ ని ఆకట్టుకునే విధంగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అదే విధంగా ఇందులో హీరోయిన్ జెన్నీఫర్ లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మధునందన్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కబోతోంది.