Dil Ramesh: ఉదయ్ కిరణ్, నేను చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం… అతను చనిపోవడానికి అదే కారణం: దిల్ రమేష్

Dil Ramesh: నువ్వు నేను సినిమా షూటింగ్ సమయంలో హీరో ఉదయ్ కిరణ్ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడన్న, అప్పటికీ ఆయనకు అది రెండో చిత్రమని ఆర్టిస్ట్ దిల్ రమేశ్ అన్నారు. తన లైఫ్‌లో ఉదయ్ కిరణ్ చనిపోవడం అనేది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అని ఆయన చెప్పారు. ఆయనతో పాటు హీరో శ్రీహరి మరణం కూడా తనను బాగా కలచివేసిందని, ఆయనెప్పుడూ నీకు తప్పకుండా ఒక రోజు వస్తుందని, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందంటూ ఎంకరేజ్ చేసేవారని రమేశ్ తెలిపారు. ఆయనతో దాదాపు 10 సినిమాలు చేశానని రమేశ్ చెప్పారు.

ఇక తనకూ, ఉదయ్ కిరణ్‌కు ఎలాంటి రిలేషన్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు గానీ, తాము షూటింగ్ జరుగుతున్నపుడే తప్ప, ఆ తర్వాత మాత్రం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమని, అతను తనకు ఓ బ్రదర్‌లా అనిపించేవాడని రమేశ్ అన్నారు. కొంచెం ఒత్తిడికి గురవడం వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయాడని, చాలా మంచి కుర్రాడు అని ఆయన అన్నారు. ఇకపోతే సక్సెస్ అనేది అందరికీ అవసరమని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ కోరికలు ఎక్కువైపోవడం వల్ల సంతృప్తి అనేదే లేకుండా పోతుందని ఆయన చెప్పారు. అవన్నీ పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారని ఆయన అన్నారు. ఎవరైనా ఎంత దూరం పెరిగెత్తినా ఏదో ఒక దగ్గర ఆగాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఉదయ్ కిరణ్ కేవలం లోన్లీనెస్, అవకాశాలు లేకపోవడం వల్లే ఆయన అంతవరకూ తెచ్చుకున్నారని రమేశ్ తెలిపారు.

శ్రీహరి చనిపోయేకంటే కొన్ని రోజుల ముందే తాము ఆయనలో వస్తున్న మార్పును గమనించామని రమేశ్ అన్నారు. కేర్ తీసుకోకపోవడం వల్ల, నెగ్లెట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్‌ నుంచి రికవరీ అవుతున్న సమయంలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన తెలిపారు. శ్రీహరి మంచి ఆర్టిస్ట్ అన్న రమేశ్, ఆయన్ని రిప్లేస్ చేసేవారు అసలు లేరని ఆయన చెప్పారు. ఆ తరహాలో సాయికుమార్, జగపతి బాబు లాంటి వారు ఉన్నా కూడా ఆ రేంజ్‌లో, ఆ స్టైల్‌లో చేసే వారు మాత్రం రాలేరని రమేశ్ స్పష్టం చేశారు.