సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఇద్దరు టాలివుడ్ హీరోలు?

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన సహజ అందంతో అందరినీ ఆకట్టుకున్న నటి సాయి పల్లవి. మొదట మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగులో సాయి పల్లవి నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి అందానికన్నా ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో తన అందం గురించి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం సాయి పల్లవిని ప్రేక్షకులు అలాగే ఆదరిస్తున్నారు.

ఇలా ప్రతి సినిమాలో తన సహజ అందంతో పాటు అభినయంతో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. కొన్ని రోజులుగా సాయి పల్లవి తరచు వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల రానాకి జోడీగా సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యు లలో పాల్గొంటూ సందడి చేసింది. అయితే ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో సాయి పల్లవి మీద కేసు కూడా నమోదయ్యింది.

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి టాలివుడ్ ఇండస్ట్రీలో తనకి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు సాయి పల్లవి మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలు రానా,నాగ చైతన్య నాకు మంచి స్నేహితులు. వీరిద్దరూ నన్ను తమ కుటుంబసభ్యుల లాగా ట్రీట్ చేస్తూ చాలా కేర్ తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సాయి పల్లవి నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఇక రానాతో కలిసి ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాలో నటించింది. ఇక సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె గార్గి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.