ఇండస్ట్రీ టాక్ : ఈ సెన్సేషనల్ సినిమాలో ప్రభాస్ కోసం ఇద్దరి హీరోయిన్స్..?

prabhas : ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనకి ఉన్న పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ లో ఒక సాలిడ్ హిట్ అందుకుంటే చూడాలని ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాను నటించిన భారీ సినిమాలు రిలీజ్ అయ్యి ప్లాప్ లు కావడంతో ఇక చేయబోయే మిగతా సినిమాలపై అంతా అసలు పెట్టుకున్నారు.

అయితే లిస్ట్ లో ఇండియా లెవెల్ సినిమాలు పక్కన పెడితే కాస్త బౌండరీలు దాటి పాన్ ఆసియా పాన్ వరల్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేసిన ఒక పవర్ ఫుల్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే “స్పిరిట్”.

జస్ట్ ప్రకటనతోనే ఎనలేని క్రేజ్ ని తెచ్చుకున్న ఈ సినిమా పైనే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి క్రేజీ సమాచారం బయటకి వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించేందుకు ప్రస్తుతం స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్ లు కియారా అద్వానీ మరియు నేషనల్ క్రష్ రష్మికా మందన్నాల పేర్లు తీసుకొచ్చారట.

కన్ఫర్మ్ గా అయితే ఈ ఇద్దరిలో ఒకరు ప్రభాస్ పక్కన కనిపిస్తారట. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా కియారా జంట అంటేనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది టాక్ మాత్రమే తర్వాత దీనిపై ఒక కంప్లీట్ క్లారిటీ పక్కాగా వస్తుంది.