రాజకీయాలు అంటేనే అంతే బాస్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాత్రికి రాత్రే పరిణామాలు మారుతుంటాయి. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేత.. రేపు మరో పార్టీలో ఉండొచ్చు. కొందరు నాయకుడు అప్పటి వరకు హుషారుగా ఉండి వెంటనే సైలెంట్ అవుతుంటారు. ఇలా..రకరకాలుగా ఉంటాయి రాజకీయాలు.
కొందరు నాయకులు సైలెంట్ అవడమే కాదు.. పార్టీ కార్యక్రమాలకు వెళ్లరు. పార్టీ నాయకులతో టచ్ లో ఉండరు. తమ క్యాడర్ తో మాత్రం వేరే పార్టీకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్లు సైలెంట్ అయినప్పుడే అర్థమయిపోతుంది.. ఏదో జరుగుతోందని.. వాళ్లు వేరే పార్టీ వైపు చూస్తున్నారని.
ప్రస్తుతం విజయనగరం జిల్లాలోనూ అదే జరుగుతోంది. అక్కడ టీడీపీ నేతల్లో ఏదో ఆందోళన నెలకొన్నది. కొందరు నేతలు సడెన్ గా సైలెంట్ అయిపోయేసరికి వాళ్లు ఏ పార్టీలోకి మారుతారో అన్న టెన్షన్ టీడీపీ పెద్దల్లో స్టార్ట్ అవుతోంది.
టీడీపీలో ఓ రేంజ్ లో వెలుగు వెలిగిన నాయకుడు కేఏ నాయుడు. ఈయనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో ఉన్నారట. ఆయన గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కూడా. అయినప్పటికీ.. చంద్రబాబు ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదట. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఇన్ చార్జ్ ల నియామకంలోనూ ఆయన పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకోకపోవడంతో.. ఆయన కాస్త దూకుడు తగ్గించి వేరే పార్టీవైపు చూస్తున్నారట.
మరో నాయకుడు చీపురుపల్లి మాజీ ఇన్ చార్జ్ కొచ్చర్లపాటి త్రిమూర్తి రాజు. ఆయనను కూడా పార్టీ హైకమాండ్ నిరాశ పరిచిందట. ఆయనకు కనీసం టికెట్ కూడా ఇవ్వడం లేదట. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకున్నా.. పార్టీ కోసం పనిచేశానని.. అయినప్పటికీ.. పార్టీ తనను పట్టించుకోకపోవడంతో పక్క చూపులు చూస్తున్నాడట.
వీళ్లు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారు… అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. పొలిటికల్ సర్కిల్ మాత్రం ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ఒకవేళ.. వీళ్లిద్దరు టీడీపీని వీడితే.. విజయనగరంలో టీడీపీ పడిపోయినట్టే అని అంటున్నారు విశ్లేషకులు.