Radhe Shyam : ట్విట్టర్ రివ్యూ : అవైటెడ్ “రాధే శ్యామ్” కి షాకింగ్ రివ్యూస్ ఇస్తున్నారు..!

Radhe Shyam : మొత్తానికి మూడున్నర ఏళ్ళు దాదాపు నాలుగేళ్ళ నిరీక్షణకు ఈరోజుతో తెర పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్” ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యింది. థియేట్రికల్ గా మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ సినిమా ఎలా ఉంటుందా అనే దానికి చిత్ర బృందం ఈరోజుతో సమాధానం అందించారు.
అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ముందే బొమ్మ పడిపోయింది. ఇలా స్టార్ట్ అయ్యిన సినిమా ట్విట్టర్ నుంచి అనూహ్య స్పందన దక్కడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా చూసినవారు అంతా ఆల్ మోస్ట్ ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ మినహా మిక్సిడ్ టాక్ నే చెబుతున్నారు.
సినిమాలో హైలైట్స్ ప్రభాస్ మరియు విజువల్స్ ఇంకా లాస్ట్ 20 నిమిషాలు సహా దర్శకుడు రాధా కృష్ణ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి కాగా కాస్త కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే మరియు అనేక చోట్ల డల్ గా ఉండే కథనాలు సినిమాకి దెబ్బేసాయట. దీనితో చాలా మంది ఈ సినిమా అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేదని..
ఇది ఎబో యావరేజ్ సినిమా అని అంటున్నారు. ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని వచ్చిన ఈ చిత్రానికి ఈ రివ్యూస్ చాలా షాకింగ్ అని చెప్పాలి. కానీ మరోపక్క అయితే ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం పాజిటివ్ రివ్యూస్ నే అందిస్తున్నారు. మరి ఫైనల్ గా రాధే శ్యామ్ కి ఎలాంటి ఫలితం అందుతుందో చూడాలి.
https://twitter.com/Maheshkaranamm/status/1502115193559695392?s=20&t=3eS9qwWQxZ9vaOmoj31kJw