Sebastian PC 524 : ట్విట్టర్ రివ్యూ : “సెబాస్టియన్ పిసి 524” ఎంతవరకు గట్టెక్కింది..?

Sebastian PC 524

Sebastian PC 524 : ఎట్టకేలకు మళ్ళీ ప్రపంచంలో కరోనా ప్రభావం తగ్గి అందరికీ ఉపశమనం దక్కింది. మూడో వేవ్ లో భారీ స్థాయిలో కేసులు పెరిగినా వాక్సిన్ వేసుకోడం చాలా మందిని కాపాడింది. మరి దీనితో మొదటగా ఉపశమనం కలిగింది మాత్రం సినీ పరిశ్రమకే అని చెప్పాలి. అలా ఎట్టకేలకు మళ్ళీ ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్ లోకి వచ్చి పలకరిస్తున్నాయి.

మరి గత వారం “భీమ్లా నాయక్” తో మరింత స్థాయిలో రచ్చ స్టార్ట్ కాగా ఈ వారం మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “సెబాస్టియన్ పిసి 524” కూడా ఒకటి. దర్శకుడు సయ్యపురెడ్డి బాలాజీ తెరకెక్కించగా డీసెంట్ ప్రమోషన్స్ తోనే రిలీజ్ అయ్యింది. అయితే నిన్న రాత్రే ఈ సినిమా స్పెషల్ షో పడిపోయింది.

అలాగే ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి. మరి అవి చూసాక నెటిజన్స్ ట్విట్టర్ లో తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే వీటిలో మోస్ట్లీ ఈ సినిమా పై మిక్సిడ్ టాక్ నే ఎక్కువగా వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు బాగానే ఉన్నా సెకండాఫ్ తోనే ప్రాబ్లమ్ వచ్చిందట, అలాగే సినిమా కాన్సెప్ట్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే అనిపిస్తాయి కానీ..

తర్వాత సినిమా డీవియేట్ అయ్యి నిరుత్సాహపరుస్తుంది ట్విట్టర్ ప్రజానీకం రివ్యూస్ ఇస్తున్నారు. మరికొందరు అయితే సినిమా స్క్రీన్ ప్లే బాగాలేదు అంటున్నారు. మరి ఫైనల్ గా కిరణ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Sebastian PC 524 Twitter Review :

https://twitter.com/SwayamD71945083/status/1499444907403997184?s=20&t=uqYUmtEMkittQlAcaOE9pg

https://twitter.com/start123action/status/1499561940502282244?s=20&t=uqYUmtEMkittQlAcaOE9pg