Sebastian PC524 Trailer : ఫన్నీగా కిరణ్ అబ్బవరం ట్రైలర్!

Sebastian PC524 Trailer  : కొత్తగా దూసుకొస్తున్న హీరో కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ థియేట్రికల్ ట్రైలర్ తో సోమవారం ఉదయం ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. క్లాస్ మాస్ ఎంటర్ టైనర్ గా వున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం రేచీకటి తో బాధపడే కానిస్టేబుల్ గా ట్రైలర్ లో ఆకర్షిస్తాడు. కానిస్టేబుల్ పేరు సెబాస్టియన్, నెంబరు 524. రేచీకటి బాధితుడైన క్యారక్టర్ లో నైట్ డ్యూటీలు ఎలా చేస్తాడనేది ఫన్నీ గా చూపించారు.

నైట్ డ్యూటీ చేయమని ఇతర కానిస్టేబుల్స్ ని బతిమాలుకోవడం, ఛీత్కారాలు ఎదుర్కోవడం జరుగుతూ, హీరోయిన్ నువేక్షతో లిప్ లాక్ రోమాన్స్ చేస్తాడు. మదనపల్లి పాత పట్నం రెండో వీధిలో మర్డర్ జరగడంతో కిరణ్ అబ్బవరం సస్పెండ్ కూడా అవుతాడు. సస్పెండ్ అయిన కిరణ్ అబ్బవరం తన రేచీకటి సమస్యతో మర్డర్ కేసుని తానే సాల్వ్ చేయడం మొదలెడతాడు. ‘ఉద్యోగం గొప్పదా, న్యాయం గొప్పదా అన్నప్పుడు న్యాయమే గొప్పది’ అని తల్లి మోటివేట్ చేసే సన్నివేశం వుంటుంది. ట్రైలర్ లో కథ అర్ధమైపోయే వుంటుంది…

‘రాజుగారు- రాణివారు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైన కిరణ్ అబ్బవరం ఈ తాజా మూవీతో ఇంకెంత దగ్గరవుతాడో చూడాలి. నువేక్షతో బాటు ఇంకో హీరోయిన్ గా కోమాలీ ప్రసాద్,, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటించారు.

బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాజ్ కె నల్లి కెమెరా నిర్వహించారు. మార్చి 4న, అంటే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

SebastianPC524 Trailer | Kiran Abbavaram, Nuveksha, Komalee Prasad | Balaji Sayyapureddy | Ghibran