Vaishnavi: బుల్లితెర నటి వైష్ణవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మా టీవీలో ప్రసారమవుతున్న దేవత సీరియల్ లో సత్య పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. అంతే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం వైష్ణవి సీరియల్స్ కి దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. బుల్లితెరకు దూరమైనప్పటికీ వైష్ణవి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తన లైఫ్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ అని యూట్యూబ్ వీడియోలు ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటోంది.
కొంతకాలం క్రితం నటి వైష్ణవి నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సురేష్ అనే వ్యక్తితో గత నెలలో చాలా వైభవంగా వైష్ణవి నిశ్చితార్థం జరిగింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైష్ణవి దానికి సంబంధించిన షాపింగ్ మొదలుకొని అయిపోయే వరకు ప్రతిరోజు లేటెస్ట్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి కావలసిన వస్తువులను షాపింగ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసేది. దీంతో ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
తాజాగా వైష్ణవి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వైష్ణవి 5 రోజుల పెళ్ళి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ 5 రోజుల పెళ్ళి వేడుకలను ప్రతి రోజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ షేర్ చేసింది. తన పెళ్ళికి సంబందించిన వీడియోస్ కావటంతో మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకొని వైష్ణవి టాప్ ట్రెండింగ్ నెంబర్ 1గా నిలిచింది. అయితే వైష్ణవీ వివాహం చేసుకున్న వ్యక్తి వివరాల గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. వైష్ణవి భర్త సురేష్ కుమార్ ఒక సీరియల్ డైరక్టర్ . మాటీవీ లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వారు కావటంతో ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.