Raviteja In Balayya Film : బాలయ్య సినిమాలో రవితేజ?? దీనిపై అసలు నిజం మీకోసం.!

Raviteja In Balayya Film :  నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ సినిమా “అఖండ” సెన్సేషనల్ హిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అదిరే లైనప్ ని సెట్ చేసుకొని అభిమానులని మళ్లీ ఎక్కడా తల దించుకోని విధంగా అదిరే ప్రాజెక్ట్స్ ఓకే చేశారు.
మరి వీటిలో దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ మాసివ్ ప్రాజెక్ట్ ని ఓకే చెయ్యగా దీని తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి తో సినిమా చేయనున్నారు.
అయితే అనీల్ తో చేసే సినిమాపైనే గత కొన్ని రోజులు నుంచి క్రేజీ గాసిప్ వినిపిస్తు వున్నాయి. ఈ సినిమాలో బాలయ్య తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి.
దీనితో ఈ వార్తలు ఒక్కసారిగా మంచి ఊపు అందుకోడమే కాకుండా ఇరు హీరోల అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయాయి. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో నిపుణులు చెవుతున్న అసలు మేటర్ బయటకి వచ్చింది.
బాలయ్య సినిమాలో మరో హీరో పాత్రే లేదని అలాగే హీరో రవితేజ నటిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని అంటున్నారు. అలాగే బాలయ్య రవితేజ అభిమానులు ముందే అంచనాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.
సో బాలయ్య సినిమాలో మాస్ మహారాజ్ అనే టాక్ అబద్ధం అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.