పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా చిత్రాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఇకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో స్టార్ నటుడు రానా సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక దర్శకుడు, పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం చాలానే ఉంది. నిజానికి వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు ఒక్కటే చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ చొరవతో ఈ రీమెక్ సినిమా మధ్యలో వచ్చి చేరింది. హారిక హాసిని బ్యానర్ నిర్మాణంలోకి దిగడానికి కూడ త్రివిక్రమే ప్రధాన కారణం. కొత్త కథ కాకపోవడం, తక్కువ వర్కింగ్ డేట్స్ సరిపోతుండటంతో పవన్ సినిమాకు ఒప్పుకున్నాడు.
ఒప్పుకునేటప్పుడే పవన్ త్రివిక్రమ్ వద్ద అంతా తానే చూసుకోవాలని కండిషన్ కూడ పెట్టారట. త్రివిక్రమ్ ఇచ్చిన మాట మేరకు సినిమాలోని ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారట. మాటలు, స్క్రీన్ ప్లే రాయడం దగ్గర్నుండి సినిమాలో ఎన్ని పాటలు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, నటీ నటుల ఎంపిక అన్నీ త్రివిక్రమే ఫైనల్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అవుట్ ఫుట్ గొప్పగా రావాలనే ఉద్దేశ్యంతో ఆయన సాగర్ కె చంద్రకు అన్ని విధాలుగా సపోర్ట్ అందిస్తున్నారు. మొత్తానికి గురూజీ సినిమా మీద స్పెషల్ కేర్ పెట్టారని మాత్రం అర్థమవుతోంది. ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు టీమ్.