Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ సంపాదనే హాట్ టాపిక్.! ఎందుకంటే.!

Trivikram Srinivas : ‘భీమ్లానాయక్’ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని వుంటారు.? అన్నదానికంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకున్న రెమ్యునరేషన్ ఎంత.? అన్నదానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు..’ అని దర్శకుడు సాగర్ చంద్ర, హీరో పవన్ కళ్యాణ్.. ఇలా చాలామంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.

సితార బ్యానర్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ కిందనే లెక్క. ఆ బ్యానర్ తరఫున ఏ సినిమా వచ్చినా, అందులో త్రివిక్రమ్ ‘హస్తం’ కాస్తయినా వుంటుంది. మరి, త్రివిక్రమ్ ఆయా సినిమాలకు సంబంధించి ‘రెమ్యునరేషన్’ తీసుకుంటున్నారా.? లేదంటే, వాటాలు తీసుకుంటున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

త్రివిక్రమ్ శ్రినివాస్, ‘అల వైకుంఠపురం’ సినిమా తర్వాత దర్శకుడిగా ఇంకో సినిమా చేయడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. ఈలోగా తనలోని రచయితను మాత్రం ఖాళీగా వుంచడంలేదు. దర్శకుడిగా సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ల సంగతేమోగానీ, రచయితగా త్రివిక్రమ్ సంపాదన చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది.

పది కోట్లు, ఆ పైన.. త్రివిక్రమ్ ‘పెన్ను’ కోసం ఖర్చవుతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. నిజమేనా.? మరి, దర్శకుడిగా త్రివిక్రమ్ అందుకునేదెంత.?