మహేష్‌ సినిమా కోసం ప్రయోగం చేస్తున్న త్రివిక్రమ్‌

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా పై తాజాగా ఒక న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా అతడు, ఖలేజా లను మించి ఉంటుందని ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పాడు.

అయితే త్రివిక్రమ్ మొదటిసారి తన సినిమాలో మహేష్ బాబు కోసం ఒక ఐటెం సాంగ్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్టిన సందర్భాలు లేవు, కానీ మహేష్ బాబు కోసం మొదటి సారి ఈ ప్రయోగం చేస్తున్నాడు.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి ‘అర్జునుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుసుతుంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలైంది. యాక్షన సీక్వెన్స్ తో తొలి షెడ్యూల్‌ని చేశారు. `కేజీఎఫ్‌`కి పనిచేసిన అన్బుమణి,  అరివుమణి(అన్బరివ్‌) మాస్టర్స్ సారథ్యంలో ఈ ఫైట్‌ సీక్వెన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది.