అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కొత్త సినిమాను ప్రకటించలేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ లాంటి పేర్లు వినబడినా ఏదీ ఫైనల్ కాలేదు. ప్రధానంగా తారక్, మహేష్ బాబుల సినిమాలే చర్చల్లో ఉన్నాయి. చాలామంది ఎన్టీఆర్ సినిమానే మూడు ఉంటుందని అనుకున్నారు. త్రివిక్రమ్ కూడ దాదాపు తారక్ మీదనే హోప్స్ పెట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తవ్వగానే సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అది కుదిరేలా లేదు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఆలోచనలు పూర్తి విరుద్దంగా ఉన్నాయట.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సినిమా కాబట్టి తప్పకుండా మంచి సినిమా చేయాలని అనుకుంటున్న తారక్ రెగ్యులర్ యాక్షన్ సినిమాలు కాకుండా వేరే ఏదైనా చేయాలని చూస్తున్నారట. కానీ త్రివిక్రమ్ మాత్రం హెవీ యాక్షన్ సినిమాకు లైన్ చెప్పారట. దాంతో తారక్ సున్నితంగా వద్దని చెప్పి వేరే తరహా కథ ఏదైనా ఉంటే చెప్పమని అన్నారట. దాంతో త్రివిక్రమ్ ఇప్పటికిప్పుడు కొత్త కథ అంటే ఎలా సాధ్యం అనుకుని మహేష్ బాబుతో ప్రొసీడ్ అయిపోవాలని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పి మహేష్ సినిమా తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతానని చెప్పినట్టు భోగట్టా.