SS Thaman: ఇండియన్ ఐడల్ జడ్జిగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్?

SS Thaman: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిక్ సినిమా ద్వారా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనంతరం పలు చిత్రాలకు సంగీతం అందించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.ఇక తాజాగా తమన్ సంగీత సారథ్యంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం తమన్ వాయించిన
బీజీఎంకు మాములు క్రేజ్‌ రాలేదు. ఇదే కాకుండా పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ పాటలు కూడా ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న తమన్ కు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పటికే సమంత, బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేసిన టాక్ షో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఆహా మరొక అద్భుతమైన కాన్సెప్టు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్స్ ద్వారా మరొకసారి ఆహా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరించనున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సింగర్ ల ఎంపిక కార్యక్రమం జరగగా తాజాగా షో గురించి సమాచారం బయటపడింది. ఇక ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ను ఇండియన్ ఐడల్ మేకర్స్ దాదాపుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సోషల్ మీడియా మీమర్స్ కి పండుగ అని చెప్పవచ్చు. మామూలుగా తమన్ పై కాపీ అభియోగం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మీమర్స్ తమన్ పై దారుణంగా ట్రోలింగ్ చేయడం అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమం ద్వారా తమన్ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి.