టాలీవుడ్ టాప్ 10 కమెడియన్ల ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

ప్రస్తుతం సినిమాలను చూసే ప్రేక్షకులు సినిమాల నుంచి ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అందువల్ల సినిమాల్లో కమెడియన్లకు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కమెడియన్ల రెమ్యునరేషన్లు సైతం ప్రస్తుతం ఊహించని స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమెడియన్ ఎవరనే ప్రశ్నకు వెన్నెల కిషోర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

వెన్నెల కిషోర్ ఒక్కరోజు రెమ్యునరేషన్ 3 లక్షల రూపాయలు అని సమాచారం. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సైతం ఒక్కో సినిమాకు ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. మరో సీనియర్ కమెడియన్ అయిన అలీకి కూడా ఇంతే స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది. హీరోగా మారి మళ్లీ కమెడియన్ సునీల్ రోజుకు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సరైన రోల్ దక్కితే సినిమాలను సక్సెస్ అయ్యేలా చేస్తున్న సప్తగిరి ఒక్కో సినిమాకు రోజుకు 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీనివాసరెడ్డి రోజుకు 2 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. యంగ్ కమెడియన్ ప్రియదర్శి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ కమెడియన్ రెమ్యునరేషన్ కూడా 2 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. మరో కమెడియన్ పృథ్వీరాజ్ ఒక్కో సినిమాకు రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని సమాచారం. ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా రోజుకు 2 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మరో కమెడియన్ పోసాని కృష్ణమురళి రోజుకు 2.5 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.