Narendra Modi Comments : ప్రధాని మోడీ మాటలతో మైమరుస్తున్న టాలీవుడ్ తారలు.!

Narendra Modi Comments : ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినిమా పేరు ఎంతలా వ్యాప్తి చెందిందో అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు భారతదేశ సినిమా దగ్గర తెలుగు సినిమాలే బాక్సాఫీస్ రెవెన్యూ పరంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే మన తెలుగు సినిమాలకి సంబంధించి ఖండాంతరాలు చెరిపేసి సినిమా ఏదన్నా ఉంది అంటే “బాహుబలి” అని చెప్పాల్సిందే.

అక్కడ నుంచి తెలుగు సినిమా రూటే ప్రపంచ వ్యాప్తంగా మారిపోయింది. మరి ఇలా ఇన్ని ఘనతలు అందుకుంటున్న తెలుగు సినిమాపై ఏకంగా దేశ ప్రధాని అయ్యినటువంటి నరేంద్ర మోడీ నిన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ అయ్యింది.

నిన్న తెలంగాణా శ్రీ రామానుజాచార్య కార్యక్రమానికి వచ్చిన నరేంద్ర మోడీ ప్రసంగంలో తెలుగు భాష ఖ్యాతిని కానీ ఇప్పుడు తెలుగు సినిమా పోషిస్తున్న పాత్ర వారు మన దేశ సంస్కృతిని తీసుకెళ్తున్న తీరుని కొనియాడి ఆశ్చర్యపరిచారు.

తెలుగు సినిమా స్క్రీన్ పై నుంచి ఓటిటి వరకు కూడా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడం చాలా గర్వకారణమ్ అని చెప్పడంతో మన టాలీవుడ్ సినీ తారలు మరియు నిర్మాతలు అనేకమంది మోడీ మాటలతో మరింత గర్వం వ్యక్తం చేస్తూ మైమరుస్తున్నారు.