ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల అలవాట్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో హీరోయిన్లకు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ కు పుస్తకాలు చదవటం ఎంతో ఇష్టం కాగా పెద్దపెద్ద పుస్తకాలను సైతం ఈమె సులభంగా చదవగలరు. మరో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు వంట చేయడం అంటే ఎంతో ఇష్టం.

ఆ చేసిన వంటలను రుచి చూడటంతో పాటు వాటిని మరింత రుచిగా చేయాలని ఆమె ప్రయత్నిస్తూ ఉంటారు. యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కు కొత్త కార్లను కొనుగోలు చేయడం చాలా ఇష్టం. ఇప్పటికే ఈమె దగ్గర చాలా కార్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నాకు కొత్తకొత్త ఆభరణాలను కొనుగోలు చేయడం ఎంతో ఇష్టమని సమాచారం. ఇప్పటికే తమన్నా దగ్గర చాలా నగలు ఉన్నాయని తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు గిటార్ ప్లే చేయడం ఎంతో ఇష్టం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ కు గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం కాగా కూరగాయలు, పూల మొక్కలను ఆమె పెంచుతుండటం గమనార్హం. జాన్వీ కపూర్ కు పెయింటింగ్ వెయ్యడం హాబీ కాగా ఆమె ఎంతో అందంగా పెయింటింగ్స్ వేస్తారని తెలుస్తోంది. మరో హీరోయిన్ నభా నటేష్ సైతం పెయింటింగ్ వేయడాన్ని ఎంతగానో ఇష్టపడతారు.

స్టార్ హీరోయిన్ సమంతకు గార్డెనింగ్ అంటే మరో హీరోయిన్ పూజా హెగ్డేకు టెర్రస్ గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ స్టార్ హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తమ అలవాట్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్టార్ హీరోయిన్లు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.