ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన పోలీస్ సినిమాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ రోల్స్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. పోలీస్ రోల్స్ లో నటించడం ద్వారా ఎంతోమంది హీరోలు ఘన విజయాలను అందుకున్నారు. ఫ్లాపుల్లో ఉన్న చాలామంది స్టార్ హీరోలకు పోలీస్ కథలు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాయి. చాలామంది దర్శకులు సైతం పోలీస్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తే కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటామని నమ్ముతారు. పోలీస్ రోల్ లో నటించాలని స్టార్ హీరోలు సైతం కోరుకుంటూ ఉంటారు.

పోలీస్ రోల్స్ లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించినా ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. వరుస్ ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధించింది. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలతో ఎన్టీఆర్ ఖాతాలో డిజాస్టర్లు చేరగా పోలీస్ రోల్ లో నటించిన టెంపర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాకు దర్శకత్వం వహించారు. మహేష్ బాబు కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాలో మహేష్ కొంత సమయం పోలీస్ గా కనిపించారు. ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు 2004 సంవత్సరంలో పోలీస్ రోల్ లో నటించిన లక్ష్మీ నరసింహ సినిమాతో సక్సెస్ దక్కిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న మహేష్ కు పోలీస్ రోల్ లో నటించిన దూకుడు సినిమాతో సక్సెస్ దక్కింది.

క్రాక్ సినిమాతో రవితేజకు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన ధృవ, విజయ్ పోలీస్ రోల్ లో నటించిన తెరి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ రోల్ లో నటించిన రాక్షసుడు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.