టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు ఎంతవరకు చదువుకున్నారో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలు చాలామందే ఉన్నారు. ఈ హీరోలలో చాలామంది హీరోలు అద్భుతంగా డైలాగ్స్ చెప్పగలరు. ఈ హీరోలకు కోట్ల సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ హీరోలలో కొంతమంది హీరోలు పెద్దగా చదువుకోలేదు. చదువును మధ్యలోనే ఆపివేసి సినిమాల్లోకి వచ్చిన హీరోల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ తో చదువు ఆపి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో తన రేంజ్ ను పెంచుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఎంబీఏ చదివారు. న్యాచురల్ స్టార్ నాని డిగ్రీ వరకు చదువుకున్నారు. విజయ్ దేవరకొండ బీకాం వరకు చదువుకున్నారు. రామ్ పోతినేని డిగ్రీ వరకు చదువుకున్నారు.

మరో మిడిల్ రేంజ్ హీరో శర్వానంద్ సైతం డిగ్రీ చదివారు. మెగాస్టార్ చిరంజీవి కామర్స్ లో డిగ్రీ చదివారు. నందమూరి బాలకృష్ణ డిగ్రీ చదివారు. నాగ్ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ నుంచి పట్టా పొందారు. విక్టరీ వెంకటేష్ ఎంబీఏ చదువుకున్నారు. బన్నీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ చదివారు.

టాలీవుడ్ హీరో నితిన్ ఇంజనీరింగ్ చదివారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బీటెక్ చదివారు. రవితేజ కూడా డిగ్రీ వరకు చదువుకున్నారు. గోపీచంద్ రష్యాలో బీటెక్ చదివారు. కళ్యాణ్ రామ్ చికాగోలో ఎం.ఎస్. చదివారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది ఊహించని స్థాయిలో చదువులు చదివారు. ఈ హీరోలలో చాలామంది హీరోలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.