బాలయ్య ఇదే కదా.. అభిమానికి చేసిన సహాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలకృష్ణ పేరు చెప్పగానే చాలా మంది ఆయనకు చాలా కోపం ఎక్కువ, తొందరగా అభిమానుల పై చేయి చేసుకుంటారనే అందరూ భావిస్తారు. నిజానికి బాలయ్య బాబు మనసు బంగారం అని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో నిరూపితమైంది. ఎంతో మందికి బసవతారకం ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించి తన మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ తాజాగా మరోసారి తన మనస్తత్వాన్ని బయటపెట్టారు. అభిమాని కోసం బాలయ్య చేసిన సహాయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.

ఆదోని మరాగేరేలో ఉండే బాలయ్య అభిమాని కాశి విశ్వనాధ్ చిన్నప్పటి నుంచి బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఎలాగైనా తన అభిమాన నటుడిని కలవాలి తనతో మాట్లాడాలని కోరికగా ఉన్నా కాశీవిశ్వనాధ్ నెల రోజుల క్రితం తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో తన అభిమాన నటుడిని కలవలేకపోయానని ఎంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆదోని బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు తమ అభిమాన నటుడు గురించి బాలకృష్ణకు తెలియజేశారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ తన అభిమాని కాశీ విశ్వనాథకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అలాగే తన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే తెలియ చేయాలని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ధైర్యంగా ఉండాలని బాలకృష్ణ సూచించారు. ఈ విధంగా తమ అభిమాన నటుడి కోరికలు తీర్చిన బాలకృష్ణ తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ విషయం తెలిసిన ఎంతోమంది బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.