టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకోవడం వెనుక డైరెక్టర్ల కృషి ఎంతో ఉంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అయితే సినిమాలు సక్సెస్ సాధిస్తే డైరెక్టర్లు కూడా పారితోషికాలను అమాంతం పెంచేస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గమని స్టార్ డైరెక్టర్లు చెబుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం రాజమౌళి 80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పోల్చి చూస్తే రాజమౌళి ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకోవడం గమనార్హం. మరే డైరెక్టర్ తీసుకోని స్థాయిలో రాజమౌళి పారితోషికాన్ని అందుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు జక్కన్న లాభాల్లో వాటా కూడా తీసుకున్నారని బోగట్టా.
ఆర్‌ఆర్‌ఆర్ 2,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఉంటే రాజమౌళికి లాభాల్లో మరింత ఎక్కువ మొత్తం దక్కి ఉండేది. మహేష్ సినిమా కోసం రాజమౌళి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని తెలుస్తోంది. మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారు.
ప్రశాంత్ నీల్ కూడా పారితోషికంతో పాటు వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రైజ్ కు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప ది రూల్ కు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.