Tollywood: టాలీవుడ్ స్టామినా పెరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలకు కూడా తీవ్ర పోటీ ఇస్తోంది. ఇటు సౌత్ లో కూడా తెలుగు సినిమాలకు ఎనలేని క్రేజ్ ఉంది. దీంతో సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు స్టార్స్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో సినిమాల బడ్జెట్ రూ. 150 కోట్లు దాటిపోతోంది. స్టార్ హీరోలు కూడా తమ మార్కెట్ కు అనుగుణంగా కోట్లలో ఛార్జ్ చేస్తున్నారు.
కోట్లు తీసుకునే స్టార్ హీరోలు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. బంగ్లాలు, ఖరీదైన కార్లు ఇలాా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రత్యేకమే. తాజాగా మన స్టార్లు సొంతంగా ఛార్టెడ్ ఫ్లైట్స్ ను కూడా కలిగి ఉంటున్నారు.
సినిమాకు రూ. 150 కోట్లు వసూలు చేస్తు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఏకంగా సొంత విమానాన్ని కలిగి ఉన్నాడు. దీంతో పాటు మరికొంత మంది టాలీవుడ్ స్టార్లు కూడా సొంత విమానాలను కలిగి ఉన్నారు. సినిమాకు రూ. 30-40 కోట్లు తీసుకునే ఎన్టీఆర్ కూడా చాలా కాలం క్రితమే చార్టెడ్ ఫ్లైట్ కొన్నాడు. ట్రిపుల్ ఆర్ తరువాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారుతున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇక పుష్ప సినిమా ద్వారా ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆయన కూడా ఓ సొంత విమానాన్నికలిగి ఉన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లు కూడా ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఎటైనా వెళ్లాలనుకుంటే.. సొంత చార్టెడ్ ప్లైట్స్ ని వినియోగిస్తున్నారు. పవర్ స్టార్ ఇటు రాజకీయంగా.. అటు నటుడిగా బిజీగా ఉన్నారు. ఆయన కూడా తన పనుల కోసం చార్టెడ్ ఫ్లైట్ ఉపయోగిస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున ఇటు బిజినెస్ అటు నటుడిగా భాగానే ఆర్జిస్తున్నాడు. ఈయనకు గతంలోనే సొంత ఫ్లైట్ ఉంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ప్రస్తుతం ఆకాశం అంత ఉంది. అర్జున్ రెడ్డి ఇచ్చిన క్రేజ్ తో ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయ్యాడు. తనకు వచ్చిన ఫేమ్ తో వ్యాపారాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ముంబై కి వెళ్లాలంటే సొంత చార్టెడ్ ఫ్లైట్ లో వెళతారు. ఈయన కంటే ముందు హీరోలుగా స్థిరపడ్డ నాని, శర్వానంద్ లాంటి వాళ్లకు మాత్రం సొంత ఫ్లైట్స్ లేవు.