Prabahs: ప్రభాస్ చేసిన పనికి తలలు పట్టుకుంటున్న అభిమానులు?

Prabahs: టాలీవుడ్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మాత్రమే కాకుండా సలార్ స్పిరిట్, ప్రాజెక్ట్ కె, లాంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే హీరోలు కొన్ని కొన్ని సార్లు వారికి వచ్చిన సినిమా ఆఫర్లను వదులుకుంటూ ఉంటారు. అలా చాలా మంది వారు వదులుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రభాస్ కూడా గతంలో ఐదు క్రేజీ బ్లాక్ బస్టర్ ని వదులుకోవాల్సి వచ్చిందట. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన కిక్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఆఫర్ మొదట ప్రభాస్ కి వచ్చినా పలు కారణాల వల్ల ఆ సినిమాని వదిలేసి ఉన్నాడట. ఇక్కడ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా మొదటి ఆఫర్ ప్రభాస్ కి వచ్చినప్పటికీ ప్రభాస్ ఆ సినిమా కథ నచ్చకపోవడంతో వదులుకున్నాడట. అలాగే మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచిన ఒక్కడు సినిమా కూడా ప్రభాస్ కు వచ్చినప్పటికీ అందులో కబడ్డీ గేమ్ ఉండటం ఉండటం వల్ల ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ప్రభాస్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట.

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో రికార్డుల్ని తిరగరాసిన చిత్రం సింహాద్రి సినిమా కూడా ముందు ప్రభాస్ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చినప్పటికి ఈ పాత్ర త‌న‌కు సూట్ కాద‌ని ప్ర‌భాస్ రిజెక్ట్ చేసాడట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన నాయక్ సినిమా ఆఫర్ కూడా ప్రభాస్ చేయాల్సి ఉండగా డేట్స్ వ‌ల‌న ఆ ప్రాజెక్ట్‌ మిస్ చేసుకున్నాడట.ఇలా ప్ర‌భాస్ ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌ని ప‌లు కార‌ణాల వ‌ల‌న వ‌దులుకున్నాడు. ఇవి క‌నుక చేసి ఉంటే ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత‌గా పెరిగి ఉండేద‌ని అంటున్నారు. ప్రభాస్ చేసిన పనికి అభిమానులు ఎంతపని చేశావు అన్న అంటూ తలలు పట్టుకుంటున్నారు.