వైరల్ : కవల పిల్లలకి పేరెంట్స్ అయ్యిన టాలీవుడ్ ప్రముఖ జంట.!

chinmayi sripada shares another me too allegations on vairamuthu

తెలుగు సినిమా దగ్గర ఉన్న కొంతమంది సినీ ప్రముఖుల్లో ఒక్కొక్కరిది ఒక్కో లోకం.. ఎవరి మట్టుకు వారు తమదైన యాటిట్యూడ్ తో సినిమా లో నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే వీరిలో సినిమాకే చెందిన భార్య భర్తలు ఉండడం కూడా అరుదే అలాంటి స్టార్ జంటలో ప్రముఖ నటుడు మరియు దర్శక రచయిత రాహుల్ రవీంద్రన్ మరియు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు ప్లే బ్యాక్ సింగర్ ముఖ్యంగా ఫెమినిస్ట్ గా చెప్పబడే సెలెబ్రెటీ చిన్మయి ల జంట ఒకటి. 

రీసెంట్ గానే ఈ జంట అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో నటించి సర్ప్రైజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ స్టార్ పెయిర్ పేరెంట్స్ అయ్యినట్టుగా తెలిపారు. రాహుల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి తాము పండంటి ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు అయ్యామని.. 

మా కొత్త లోకం లోకి వారికి స్వాగతం చెబుతున్నామని తెలిపాడు. మరి ఆ పిల్లలకి కూడా అప్పుడే పేర్లను కూడా రాహుల్ పెట్టేసాడు. దృప్తా – శర్వాస్ అంటూ వారికి పేర్లు పెట్టి ఈ సంతోషకర వార్తని సోషల్ మీడియాలో పంచుకోగా ఇప్పుడు అది మంచి వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వారు ప్రొఫిషినల్ గా కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.