Top Hero: దేశంలోనే నెంబర్ వన్ హీరో .. తేల్చేసిన లేటెస్ట్ సర్వే.. ఆ హీరోలకు ఊహించని షాక్!

Top Hero: ఒకప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అండ్ పేరు మాత్రమే గుర్తుకు వచ్చేది కానీ ఇటీవల కాలంలో ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు గుర్తుకు వస్తాయి ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మంచి సక్సెస్ అందుకొని దూసుకుపోయేది కానీ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ డామినేట్ చేస్తూ మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఒకానొక సమయంలో ఇండియన్ ఇండస్ట్రీని సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి వారు ఏలారు కానీ ఇప్పుడు ఆ హీరోలకు పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి.

తాజాగా ఆర్మార్క్స్ సర్వే సంస్థ మే నెలలో అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న హీరోల జాబితాలను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలలో బాలీవుడ్ హీరోలు టాప్ టెన్, 9 స్థానాలలో ఉండటం గమనార్హం. మరి ఈ సర్వే ప్రకారం ఒకటి నుంచి పది స్థానాలలో ఉన్న హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ సర్వే ప్రకారం అత్యంత ఆదరణ పొందినటువంటి హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.

గత కొంతకాలంగా ప్రభాస్ అత్యంత ఆదరణ పొందిన హీరోల జాబితాలలో మొదటి స్థానం నుంచి పక్కకు జరగలేదనే చెప్పాలి. మొదటి స్థానంలో మరోసారి ప్రభాస్ నిలవడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి, మూడో స్థానంలో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్, ఐదో స్థానంలో హీరో అజిత్, ఆరో స్థానంలో మహేష్ బాబు, ఏడో స్థానంలో ఎన్టీఆర్, ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్, తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్, పదో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ షారుక్ ఖాన్ వంటి వారందరూ కూడా మొదటి స్థానంలో ఉండేవారు కానీ ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో మన టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున మొదటి స్థానాలలో నిలవటం విశేషం అయితే ఈసారి RRR హీరోలు మాత్రం కాస్త వెనక పడ్డారని చెప్పాలి.