Chiranjeevi: షూటింగ్ స్పాట్ కు గన్ తీసుకెళ్లిన చిరంజీవి.. ఒక్కసారిగా వణికిపోయిన లొకేషన్?

Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ప్రమాదకరమైన వస్తువులతో షూటింగ్ తీయాల్సి వస్తే వాటి స్థానంలో డూప్ వస్తువులను ఉంచి షూటింగ్ చేస్తారు. ఇలా డూప్ వస్తువులను ఉపయోగించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేకుండా షూటింగ్ ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది.కానీ గతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం షూటింగ్ లోకేషన్ కు నిజమైన గన్ను తీసుకోకపోవడంతో ఒక్కసారిగా లొకేషన్ లో ఉన్నటువంటి చిత్రబృందం హడలి పోయారు. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి లొకేషన్ కి ఎందుకు రియల్ గా తీసుకువెళ్లారనే విషయానికి వస్తే..

హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన చంటబ్బాయి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక భిన్నమైన గెటప్ లో మాత్రమే కాకుండా
సినిమాలో డిటెక్టివ్ పాత్రలో సందడి చేశారు. ఇలా ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో చిరంజీవి రివాల్వర్ ఉపయోగించాల్సి ఉంది. అయితే ఇలాంటి షూటింగ్స్ తీసే సమయంలో డూప్ రివాల్వర్ ఉపయోగిస్తారు.కానీ చిరంజీవి అప్పుడే మొదటిసారిగా లైసెన్స్ పొందిన గన్ను తీసుకోవడంతో రియల్ గా అయితే ఎంతో సహజ సిద్ధంగా ఉంటుందని తీసుకొని షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లోకేషన్ కు రియల్ గన్నుతో లొకేషన్ కి వెళ్లడంతో ఒక్కసారిగా చిత్రబృందం కాస్త భయపడినప్పటికీ ఈ గన్నుతో ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేశారు. ఇలాంటి రియల్ గన్నులతో షూటింగ్ చేయటం వల్ల అనుకోని ప్రమాదం జరిగితే చాలా బాధ పడాల్సి వస్తుందని భావించిన తరువాత మరొకసారి ఎప్పుడూ చిరంజీవి ఇలా షూటింగ్ లొకేషన్ లో రియల్ గన్నుతో కనిపించలేదు.