టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ పై చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరింది. అయితే 2017లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ విచారించింది.