AP: ఏపీ సీఎం వద్దకు టాలీవుడ్ సినీ పెద్దలు.. పవన్ వార్నింగ్ పనిచేసినట్టుందే!

AP: సాధారణంగా ప్రభుత్వ పెద్దలకు సినిమా ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది ఇలా తరచూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రాజకీయ నాయకులను సినీ పెద్దలు కలుస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు దర్శకులు కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మాత్రమే కలిశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడుని కలసిన సందర్భమే లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ మండిపడటంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి సిద్ధమయ్యారు.ఈ ఆదివారం అమరావతి వెళ్లి సీఎంను కలిసి చిత్రసీమ సమస్యలతో పాటు ఏపీ ప్రభుత్వం నుంచి తాము ఆశిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించాలని భావిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. సుమారు 45 మంది వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అమరావతిలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎంతో సినీ పెద్దలు హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు లేదా ముఖ్యమంత్రులు కలిసే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లిస్టు ఎంపిక చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఛాంబర్ ఎంపిక చేసిన లిస్ట్ కాకుండా… గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంప్రదించి ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనాలి అనే విషయాల గురించి లిస్ట్ తయారు చేసినట్టు తెలుస్తుంది.. ఇక ఈ భేటీలో భాగంగా సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి అలాగే ప్రభుత్వ సహాయ సహకారాల గురించి చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తోంది.