ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ సినిమా “వకీల్ సాబ్” సినిమా నుంచి మొదలైన టికెట్ ధరల సమస్య ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అయితే ఈ సమస్య ఇద్దరు వ్యక్తుల వల్లనే నెలకొంది అని అందరికీ తెలుసు. అయితే ఇది సినిమా నుంచి రాజకీయ రంగు పులుముకోవడంతో టాలీవుడ్ పెద్దలకి కూడా ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు.
ఇక ఇదిలా ఉండగా ఈ సమస్యకి పరిష్కారం కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు అయినటువంటి దిల్ రాజు ట్రిపుల్ ఆర్(RRR) నిర్మాత డీవీవీ దానయ్యలు ఒకరు పవన్ కోసం ఇంకొకలు ఏపీ సీఎం వై ఎస్ జగన్ అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతానికి ఇద్దరి అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్. ఇది భీమ్లా నాయక్ డేట్ మరియు టికెట్ ధరల కోసమే అట. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.