ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకున్న నమిత.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నమిత ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జెమిని, బిల్లా, సింహా వంటి తదితర సినిమాలలో నటించిన నమిత అనంతరం ఇండస్ట్రీకి దూరమై వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. నమిత 2017వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో ఎంతో ఘనంగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. వివాహం తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ గడిపిన నమిత త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వ బోతున్నారు.

ఈ క్రమంలోనే నమిత మే 10వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే అప్పట్నుంచి ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా సీమంతం వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోని ఈమె శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంతో సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ సీమంతము వేడుకలలో నమిత చీరకట్టుకుని ఎంతో సంప్రదాయబద్ధంగా సీమంతం జరుపుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఎంతోమంది నెటిజన్లు నమితకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈమె పండంటి బిడ్డకు తల్లి కాబోతున్నారు. అయితే 41 సంవత్సరాలలో నమిత తల్లి కావడం గమనార్హం.