Bramhaji: పృథ్వీరాజ్ దే తప్పు…. వైసీపీ వాళ్లు 100% కరెక్ట్… బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు?

Bramhaji: ప్రస్తుతం లైలా వివాదం కొనసాగుతుంది విశ్వక్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కమెడియన్ పృథ్వీరాజ్ పరోక్షంగా వైకాపా వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సోషల్ మీడియా ఒక్కసారిగా ఈ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేస్తూ బాయ్ కాట్ లైలా అంటూ రచ్చ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో డిజాస్టర్ లైలా అంటూ మరొక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా పట్ల వైసీపీ పూర్తిస్థాయిలో పగబట్టిందని చెప్పాలి. ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా పృథ్వి చేస్తున్న కామెంట్స్ వల్ల చిత్ర బృందం పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా తీవ్ర స్థాయిలో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలోనే మరో కమెడియన్ బ్రహ్మాజీ సైతం ఈ వివాదం పై స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ విషయం గురించి మాట్లాడుతూ 100కు 100% పృథ్వీరాజ్ ది తప్పు అని వైసిపి వాళ్ళు కరెక్ట్ అంటూ చెప్పుకు వచ్చారు.

పృథ్వీరాజ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు 8 నెలలు కావొస్తుంది ఎన్నికలకు ముందు అంటే ఇలా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ విమర్శలు చేయడం కరెక్టే కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి వారి పాలన వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఇలా సినిమా వేదికపై పృథ్వీరాజ్ మాట్లాడటం తప్పని, ఈ విషయంలో వైసీపీ వారే కరెక్ట్ అంటూ ఈయన మాట్లాడారు.

పృథ్వీరాజ్ ఇలా సినిమా వేదికపై పొలిటికల్ కామెంట్స్ చేయటంతో నష్టం ఆయనకు కాదని హీరో విశ్వక్ సేన్ సినిమాకే దెబ్బ పడిందని తెలిపారు. పాపం ఆ హీరో చాలా మంచివాడు కానీ ఈరోజు ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ బ్రహ్మజీ కమెడియన్ పృథ్వీరాజ్ ను తప్పు పడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.