నేడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు.. మౌనంగా కాంగ్రెస్ శ్రేణులు.. కారణం ఇదేనా?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీది ఈరోజు 52వ పుట్టినరోజు. అయితే ఈయన పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం మౌనంగా ఉన్నారు. దీనికి అసలు కారణం ఏంటంటే.. రాహుల్ గాంధీ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండమని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అగ్ని పథ్ పథకంపై దేశంలో నిరసనలు జరుగుతున్నాయని.. కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించవద్దని కోరారట. అగ్నిపథ్ పై దేశంలో యువకులు వేదనకు గురవుతున్నారని, నిరసనలు చేస్తున్నవారికి, వారి తల్లిదండ్రులకు కార్యకర్తలు అండగా ఉండాలి అని కోరాడు. అందుకు తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని.. తన శ్రేయోభిలాషులు అందరికీ, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.