Vastu Tips: ప్రపంచంలో అందరూ కూడా మంచి గౌరవప్రదమైన, విలాసవంతమైన జీవితం కోసం ఆరాట పడుతూ ఉంటారు కానీ ఇప్పటి ఖర్చుల కారణంగా సంపాదించే డబ్బు కంటే ఖర్చు పెట్టే డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం మంది ప్రజలు పేదరికంతో చాలా బాధపడుతున్నారు.సంపదకు ప్రతిరూపం అయినటువంటి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండక పోవడం వల్ల పేదరికం వస్తూ ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ ఈ పేదరికం నుంచి కూడా మనం బయటపడొచ్చు. దానికోసం కొన్ని పనులను మొదలు పెట్టడం వలన పేదరికం నుంచి బయట పడవచ్చు .ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఈ కొన్ని మంచి అలవాట్లను మొదలుపెట్టాలని
ఎప్పటికప్పుడు వంటగదిని,ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉండడం వలన ఇంటి శుభ్రతను కూడా మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాయంత్రం వేళ నందు పుల్లటి ఆహార పదార్థాలను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు.ఉప్పు మరియు పసుపు వంటి వాటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా ఎవరికీ ఇవ్వకపోవడమే చాలా మంచిది. అలాగే శుక్రవారం వేళల్లో డబ్బును అప్పుగా ఎవరికీ ఇవ్వకపోవడమే మంచిది.
అలాగే ప్రతిరోజు ఇంటిలో పూజలను చేసుకోవడం వలన ఇంటి నందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన మంచి ఆలోచనలు కలుగుతూ మంచి పనులను చేయడానికి ఉపయోగపడుతుంది. అందరితో సంతోషంగా గడపడానికి కూడా ఉపయోగపడుతుంది.
మద్యపానం,ధూమపానాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా కష్టపడి పనులను చేసుకోవడం వలన కూడా పేదరికం నుంచి బయట పడవచ్చును.